
అల్లు అర్జున్
అవును.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హీరోగా నటించబోయే సినిమా దాదాపు ఖరారైపోయింది. ‘మనం, 24’ రీసెంట్‌గా ‘హలో’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కు ఓ సూపర్ ఎగై్జటింగ్ కథను చెప్పారట విక్రమ్. ఆ కథ విని అల్లు అర్జున్ ఇంప్రెస్ అయ్యారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. బన్నీకి జోడీగా టాప్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారట.
మల్లు అర్జున్ సాయం
టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో దాదాపు అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ మాలీవుడ్‌లోనూ ఉంది. అందుకే ఆయన్ను కేరళ ఫ్యాన్స్ మల్లు అర్జున్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం భారీ వర్ష ప్రభావంతో కేరళ ప్రజల జీవనం ఇబ్బందిగా మారింది. ఈ విపత్తుపై అల్లు అర్జున్ స్పందించి 25 లక్షల రూపాయల అర్థిక సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాలైన ఎర్నాకులం, పాలక్కాడ్, మలప్పురం, కాలికట్ పాంత్రంలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనవలసిందిగా ఆయన తన అభిమానులకు పిలుపునిచ్చారు. ‘‘కేరళ ప్రజలకు నా హృదయంలో స్పెషల్ ప్లేస్ ఉంది. వారు చూపించే ప్రేమ, ఆప్యాయతలు ప్రత్యేకమైనవి. నా వంతుగా ఈ సాయం చేస్తున్నా’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్.
Comments
Please login to add a commentAdd a comment