
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. కృతీ శెట్టి హీరో యిన్‌గా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘లింగుసామి చెప్పిన పవర్‌ఫుల్ ఊర మాస్ సబ్జెక్ట్ మా అందరికీ నచ్చింది. కథ విన్న వెంటనే సినిమా చేద్దామన్నారు రామ్. దేవిశ్రీ ప్రసాద్ ఒక లవ్ సాంగ్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment