నాగ చైతన్య, కృతిశెట్టి మైసూర్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ | Naga Chaitanya Krithi Shetty NC22 Shooting Comepleted In Mysore | Sakshi
Sakshi News home page

NC22: నాగ చైతన్య, కృతిశెట్టి మైసూర్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌

Published Sat, Oct 22 2022 1:01 PM | Last Updated on Sat, Oct 22 2022 1:02 PM

Naga Chaitanya Krithi Shetty NC22 Shooting Comepleted In Mysore - Sakshi

మైసూర్‌కు నాగచైతన్య బై బై చెప్పారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు, హీరో నాగచైతన్య కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్‌ పతాకంపై పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దాదాపు 25రోజుల క్రితం మైసూర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్‌ ముగిసినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది.

ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ చిత్రీకరణపై త్వరలో ఓ ప్రకటన రానుంది. అరవింద్‌ స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్, ప్రేమ్‌ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్‌ రాజ్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తండ్రీ కొడుకులైన ఇళయ రాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement