హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ జైలు!  | Naga Chaitanya Thandel Movie Latest Update | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ జైలు! 

Published Mon, Mar 11 2024 2:11 AM | Last Updated on Mon, Mar 11 2024 6:34 PM

Naga Chaitanya Thandel Movie Latest Update - Sakshi

హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ జైలు ఏంటి? అనే సందేహం తలెత్తడం ఖాయం. ఇంతకీ విషయం ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్‌’ సినిమా కోసం హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ జైలు సెట్‌ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఆ జైలు సెట్‌లోనే జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

చేపల వేటలో భాగంగా పోరపాటున పాకిస్తాన్‌ సముద్రంలోకి వెళ్లి పట్టుబడిన కొందరు మత్స్యకారుల వాస్తవ ఘటనలతో ‘తండేల్‌’ రూపొందుతోంది.పాకిస్తాన్‌ జైల్లో శిక్ష అనుభవించిన వారిలో ఓ వ్యక్తిపాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లోపాకిస్తాన్‌ జైలు సెట్‌ వేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లో షూటింగ్‌ జరుగుతోంది. హీరో, హీరోయిన్, ఇతర ముఖ్య తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగేపాకిస్తాన్‌ జైలు నుంచి విడుదలై భారతదేశానికి వచ్చిన మత్స్యకారులు ఒక రైల్వే స్టేషన్‌లో దిగే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్‌లో ఈ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement