
లారెన్స్
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్‌గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో రామ్‌చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment