
లింగుస్వామి, హవీష్
హీరోలకు కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో కమర్షియల్ సక్సెస్ అవసరం. వాటిని అందించడంలో దర్శకుడు లింగుస్వామి మాస్టర్ అనుకోవచ్చు. విశాల్‌ను ‘పందెంకోడి’, కార్తీని ‘ఆవారా’తో అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి బ్రేక్‌ని అందించారు లింగుస్వామి. ఇప్పుడు హవీష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారాయన. ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఇదో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. సినిమాకు పని చేయనున్న మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. విశాల్, కార్తీ తమ కెరీర్‌లో మంచి మాస్ హీరోలుగా నిలబడే సినిమాలను ఇచ్చినట్లే హవీష్‌కు మంచి బ్రేక్‌ని అందించి లింగుస్వామి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment