గ్యాంగ్‌స్టర్‌గా సూర్య | suriya as gangster | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌స్టర్‌గా సూర్య

Published Sat, Dec 21 2013 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

గ్యాంగ్‌స్టర్‌గా సూర్య

గ్యాంగ్‌స్టర్‌గా సూర్య

 ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సూర్య. దక్షిణాది ప్రేక్షకులందరూ ఆయన్ను ఇష్టపడేది అందుకే. కెరీర్ తొలిదశలోనే విభిన్న తరహా పాత్రలు పోషించిన సూర్య... త్వరలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. పందెం కోడి, ఆవారా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాలో సూర్యకు జోడీగా సమంత నటిస్తున్నారు. సూర్య, సమంత కలిసి నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమాలో సూర్య రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఓ గెటప్ మామూలుగా ఉంటే, ఇంకో గెటప్ గడ్డంతో చాలా స్టయిలిష్‌గా ఉంటుందట. సూర్య గత చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. 80 లక్షల రూపాయలతో వేసిన ఓ సెట్‌లో సూర్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement