బ్రేక్‌ లేదు.. రామ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ | RAPO19 Update: Ram Confirms His Next Mass Movie With Linguswamy | Sakshi
Sakshi News home page

బ్రేక్‌ లేదు.. రామ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

Published Thu, Feb 18 2021 11:00 AM | Last Updated on Thu, Feb 18 2021 12:49 PM

RAPO19 Update: Ram Confirms His Next Mass Movie With Linguswamy - Sakshi

ఇటీవల చిన్న బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించిన రామ్‌ పోతినేని.. తాజాగా తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్‌ ఇస్తాడని అనుకుంటే వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన తమిళ దర్శకుడు లింగు స్వామీతో ఓ సినిమా చేయనున్నట్లు గురువారం అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. ‘దీని కోసం చాలా కాలం ఎదురు చూశాను. నా ఫేవరెట్‌ దర్శకుడు లింగు స్వామి సర్‌తో‌ రాపో19 తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. శ్రీనివాస చిత్తూరితో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. లవ్‌ రాపో’ అంటూ ట్వీట్‌ చేశాడు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబర్‌6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఇక హీరో రామ్ ఇటీవల వరుస సినిమాలు చేస్తూ స్పీడ్‌ పెంచాడు. తన తొలి చిత్రం దేవదాసులో మాస్ యాంగిల్ పాత్రలో హిట్ అందుకున్న రామ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూశాడు. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌ వంటి పక్కా మాస్ మసాలా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తరువాత రెడ్ సినిమాతోనూ ప్రేక్షకులను అలరించిన రామ్ ఇప్పుడు మరో మాస్‌ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తోంది. రామ్‌ నుంచి అప్‌డేట్‌ అందడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు.
చదవండి: కీర్తి సురేష్‌ ఎవరితోనూ ప్రేమలో లేదు..
ఆరు చలాన్లు కట్టిన టాలీవుడ్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement