ఆ చిత్రం కోసం వెయిటింగ్‌ | keerthy Suresh Waiting For Rajamouli Movie | Sakshi
Sakshi News home page

ఆ చిత్రం కోసం వెయిటింగ్‌

Published Wed, Oct 3 2018 12:17 PM | Last Updated on Wed, Oct 3 2018 12:17 PM

keerthy Suresh Waiting For Rajamouli Movie - Sakshi

కీర్తీసురేశ్‌

సినిమా: ఆ బ్రహ్మాండ చిత్రం కోసం వెయిటింగ్‌ అంటోంది నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ తొలిరోజుల్లోనే మహానటి సావిత్రి పాత్రకు జీవం పోసి శభాష్‌ అనిపించుకుంది. ఇకపై సామిత్రి పాత్రలో నటించాలంటే కీర్తీసురేశ్‌ మినహా మరో నటిని ఊహించుకోవడానికి కూడా సాహసించలేని విధంగా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల విక్రమ్‌కు జంటగా నటించిన సామి సేŠవ్క్‌ర్‌ చిత్రం కాస్త నిరాశ పరిచినా, విశాల్‌కు జంటగా నటించిన సండైకోళీ–2, విజయ్‌ సరసన నటించిన సర్కార్‌ చిత్రాలు కమర్షియల్‌గా కీర్తీసురేశ్‌ కేరీర్‌కు ఉపయోగపడతాయనే ఆశాభావంతో ఉంది. సండైకోళీ–2 చిత్రం ఈ నెల 18న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక సర్కార్‌ చిత్రం దీపావళికి సందడి చేయనుంది. తాజాగా కీర్తీసురేశ్‌ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌టీఆర్‌ జీవిత చరిత్ర అంటే నటి సావిత్రి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర నటి కీర్తీసురేశ్‌నే వరించింది.

కాగా తమిళంలో నటుడు శశికుమార్‌కు జంటగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది గానీ, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే చాలా గ్యాప్‌ తరువాత ఈ బ్యూటీ మాతృభాషలో నటించడానికి రెడీ అవుతోంది. మోహన్‌లాల్‌ హీరోగా దర్శకుడు ప్రియదర్శిన్‌ మరక్కార్‌ పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది 16వ శతాబ్దానికి చెందిన కురంజిలి మరక్కార్‌ అనే చరిత్రకారుడి ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం. ఇందులో కీర్తీసురేశ్‌ ఒక ముఖ్య పాత్రలో నటించనుందని తెలిసింది. ఇందులో తను చైనాకు చెందిన నటుడికి జంటగా నటించనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈ ముద్దుగుమ్మ మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాహుబలి సిరీస్‌ చిత్రాల ఫేమ్‌ రాజమౌళి తాజాగా జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక హీరోయిన్‌గా నటించే అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించినట్లు సమాచారం. ఇప్పుడీ చిత్రంలో నటించడానికి ఈ భామ ఎదురు చూస్తోదంట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement