సినిమా: ఒక భారీ చిత్రమే, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రమో నిర్మాణంలో ఉంటే ఆ చిత్రం గురించి తెలిసినవి, తెలియనవి, వెల్లడించనవి, వెల్లడించినవి ఇలా ఎన్నో కథనాలు ప్రచారం అవుతుంటాయి. వాటిలో అవాస్తవాలైతే సంబంధిత వ్యక్తులు కొందరు ఖండిస్తుంటారు. మరి కొందరు అదీ ఒక రకమైన ప్రచారమే కథా మౌనంగా ఎంజాయ్ చేస్తుంటారు. దర్శకుడు రాజమౌళిని రెండవ కోవలోకి చేర్చవచ్చు. నిర్మాణంలో ఉన్న తన చిత్రాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. కారణం ఆయన చిత్రాలకుండే క్రేజ్ అంత. అయితే జరుగుతున్న ప్రచారం గురించి తానుగా స్పందించరు. ఎవరైనా అడిగితే ఆ ప్రచారంలో నిజం లేకపోతే లేదని అంటారు గానీ వాస్తవం ఏమిటన్నది చిత్రం పూర్తి అయ్యేవరకూ నోరు మెదపరు. ఆయన తాజా చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే అంతకు ముందు నుంచే ఈ చిత్రం గురించి ఎన్నెన్నో కథనాలు వెలువడ్డాయి. వాటిని ఆయన అవుననలేదు, కాదనలేదు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు.
ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఈ ఇద్దరి పేరు మినహా ఇతర ఏ విషయాల గురించి రాజమౌళి పెదవి విప్పలేదు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ చిత్రం గురించి రోజుకో కథనం ప్రసారం అవుతుందంటే అతి శయోక్తి కాదు. చిత్రానికి రామ రావణ రాజ్యం అని పేరు నిర్ణయించినట్లు, ఇది పురాణ ఇతిహాసం రామాయణం ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిస్తునట్లు కథనాలు హోరెత్తుతున్నాయి. అంతే కాదు ఇందులో రామ్‌చరణ్ రాముడిగానూ, జూనియర్ ఎన్‌టీఆర్ రావణుడిగానూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నటి ప్రియమణిని ఒక ముఖ్య పాత్రకు ఎంపిక చేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక రామాయణం కథ అంటే సీత పాత్ర ఉంటుందిగా అదిగో ఆ పాత్రను నటి కీర్తీసురేశ్ పోషించనుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది దర్శకుడు రాజమౌళి గానీ, చిత్ర నిర్మాతల వర్గాలు గానీ అధికారికపూర్వకంగా వెల్లడించేవరకూ ఇలాంటి కథనాలకు అడ్డకట్ట పడదు.
Comments
Please login to add a commentAdd a comment