‘పులి ముందే వేషాలేయకూడదు’ | Vishal Pandem Kodi 2 Movie Trailer | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 1:27 PM | Last Updated on Sat, Sep 29 2018 1:31 PM

Vishal Pandem Kodi 2 Movie Trailer - Sakshi

విశాల్, మీరాజాస్మిన్‌ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌. ఈ సినిమాతోనే తెలుగులో విశాల్‌కి మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా విశాల్‌–లింగుస్వామి కాంబినేషన్‌లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైరల్‌ను రిలీజ్ చేశారు. మాస్‌ యాక్షన్‌ తో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. విశాల్‌ సరసన కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement