
త్వరగా పెళ్లి చేసుకో... కాలం గడిచిపోతే ఆ తరువాత ఎవరూ పిల్లనివ్వరు. ఈ మాట ఎవరు అన్నారో తెలుసా? కోలీవుడ్‌లో ప్రేమ వదంతులను ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో నటుడు విశాల్, నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ల జంట ఒకరు. వీరిద్దరి గురించి ఇంతకు ముందు చాలా వదంతులు హల్‌చల్ చేశాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారని లాంటి చాలా వదంతులు వైరల్ అయ్యాయి.
అయితే అవి నిజంగా వదంతులేనని విశాల్, వరలక్ష్మి నిరూపిస్తున్నారు. వాస్తవానికి విశాల్, వరలక్ష్మి మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని నటి వరలక్ష్మి మరోసారి స్పష్టం చేసింది. విశాల్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం సండైకోళి–2(తెలుగులో పందెం కోడి 2). ఇందులో ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటించగా ప్రతినాయకిగా నటి వరలక్ష్మి నటించారు.
ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. కాగా వరలక్ష్మి ఒక టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ ప్రశ్నను తానూ ఆయన్ను పలుమార్లు అడిగినట్లు చెప్పింది. ఇలాకాలం గడిచిపోతే ఆ తరువాత పెళ్లి చేసుకుందామన్నా ఎవరూ పిల్లను ఇవ్వరు అని కూడా చెప్పానని అంది. విశాల్ మాత్రం తాను నడిగర్‌సంఘం భవన నిర్మాణం తరువాతనే పెళ్లి చేసుకుంటాననే విషయంలో దృఢంగా ఉన్నారని చెప్పింది.
తన విషయానికి వస్తే తాను విశాల్‌కు సినిమాలో ఎప్పుడూ ప్రతినాయకినేనని, నిజజీవితంలో మంచి స్నేహితురాలినని చెప్పుకొచ్చింది. మరి ఇకపై కూడా ఈ జంట స్నేహితులుగానే కొనసాగుతారా, సడన్‌గా పెళ్లికి సిద్ధం అయ్యామనే షాకింగ్ ప్రకటన చేస్తారా? అన్నది చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నటి వరలక్ష్మి చేతి నిండా చిత్రాలతో ఎడాపెడా నటించేస్తోంది. ఈ అమ్మడు మరోసారి నటుడు విజయ్‌తో విలనీయం ప్రదర్శిస్తున్న సర్కార్ చిత్రం దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment