గొంతు పోయింది! | Varalakshmi dubs her voice in Telugu | Sakshi
Sakshi News home page

గొంతు పోయింది!

Published Fri, Oct 12 2018 5:53 AM | Last Updated on Fri, Oct 12 2018 5:53 AM

Varalakshmi dubs her voice in Telugu - Sakshi

వరలక్ష్మీ శరత్‌కుమార్‌

ఇప్పటి హీరోయిన్లలో కొందరు తమ పాత్రకు తమ గొంతునే వినిపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే కొంచెం కష్టమైనా శ్రద్ధగా పరభాషను నేర్చుకొని డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కూడా జాయిన్‌ అయ్యారు. అంతే కాదు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్‌’, విశాల్‌ ‘పందెం కోడి 2’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు వరలక్ష్మీ. ఈ రెండు సినిమాలకు సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకున్నారామె. ‘‘డబ్బింగ్‌ చెప్పీ చెప్పీ గొంతు పోయింది.  కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. ‘పందెం కోడి 2’ ఈ నెల 18న రిలీజ్‌ కాబోతోంది. సూపర్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ‘సర్కార్‌’ నవంబర్‌లో రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement