రంగ్‌దే ప్రీ రిలీజ్‌: చీఫ్‌‌ గెస్ట్‌గా త్రివిక్రమ్‌, కారణం అదేనట! | Rang De Pre Release: Is Nithiin Bheeshma Sentiment Will Work For RangDe | Sakshi
Sakshi News home page

రంగ్‌దే ప్రీ రిలీజ్‌: చీఫ్‌‌ గెస్ట్‌గా త్రివిక్రమ్‌, కారణం అదేనట!

Published Sun, Mar 21 2021 1:14 PM | Last Updated on Sun, Mar 21 2021 5:34 PM

Rang De Pre Release: Is Nithiin Bheeshma Sentiment Will Work For RangDe - Sakshi

సాధారణంగా మనలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లు ఫాలో అయితేనే అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుందని నమ్ముతారు. ఇక చిత్రపరిశ్రమలో అయితే ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి టీజర్‌, ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ వేడుకల వరకు దర్శకనిర్మాతలు, హీరోలు ఒక్కో సమయంలో ఒక్కో విధమైన సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా హీరో నితిన్‌కు కూడా ఒక సెంటిమెంట్‌ ఉంది. తన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరైతే విజయం వరిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకే రంగ్‌దే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ని చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించారు. 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ వేడుక జరగనుంది. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. గతేడాది నితిన్‌ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్‌కి నితిన్‌ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఆ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరు మరింత క్లోజ్‌ అయ్యారు.  శిష్యుడిగా తన దగ్గర్నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు నితిన్. అప్పట్నుంచి నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన అందించిన కథతో ఛల్ మోహన్ రంగా సినిమా చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసినపుడు కూడా అండదండలు అందించాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఈయన వెంటే ఉన్నాడు. మరి నితిన్‌ సెంటిమెంట్‌ ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే. 
చదవండి:
వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్‌
హీరోయిన్‌ కనబడుట లేదు: డోంట్‌ వర్రీ అంటున్న పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement