Rang De Movie
-
‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీలీజైన నాటి నుంచి చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నితిన్-కీర్తి చేసిన ప్రమోషన్ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. జూన్ 12 నుంచి జీ5లో రంగ్‌దే సినిమా స్ర్టీమింగ్ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. Miru entagano eduruchustunna rangu rangula prema indrajalam #RangDe premieres 12th June nunchi #ZEE5 lo matrame.https://t.co/0VsbNRwblf#RangDeOnZEE5 #Premieres12thJune #ZEE5@actor_nithiin @KeerthyOfficial #VenkyAtluri @ThisIsDSP pic.twitter.com/l2K9iSuEPQ — ZEE5 Telugu (@ZEE5Telugu) May 28, 2021 -
OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్టైన్మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం.. జగమే తంత్రం.. హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట. వకీల్ సాబ్.. ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. థ్యాంక్ యు బ్రదర్.. యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నారప్ప.. విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రంగ్‌దే.. నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణన్.. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్లో మార్పు ఉండే అవకాశం ఉంది. మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. చదవండి: మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్ బిగ్‌బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్త ఓవర్ చేస్తోందంటూ.. -
పెళ్లి గురించి పెదవి విప్పిన కీర్తి సురేశ్
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ టాక్ అందుకుంది. రీల్ అండ్ రియల్ లైఫ్‌లో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వీళ్లిద్దరూ ఇటీవల సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మహానటి' కీర్తి సురేశ్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. మానవత్వం మెండుగా ఉండాలని కండీషన్ పెట్టింది. అంటే మనిషి మంచోడై ఉంటే అదే చాలు అని పేర్కొంది. ఇంకా తను పెళ్లాడే వ్యక్తి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు తెలియకుండానే మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారని నవ్వేసింది. అయితే తను నిజంగా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా బోలెడంత టైమ్ ఉందని చెప్పుకొచ్చింది. హీరో నితిన్ హోలీ పండగ గురించి మాట్లాడుతూ.. హోలీ వేడుకల్లో రంగులైపోతే కోడి గుడ్లు, బురద కూడా పూసుకుంటామని చెప్పాడు. తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ అయినా చేయడం తన డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. వీళ్లింకా ఏమేం విషయాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూసేయండి.. చదవండి: రవితేజ ‘ఖిలాడి’ టీమ్‌కి ఊహించని షాక్ ‘రంగ్‌దే’ మూవీ రివ్యూ -
నితిన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సినిమా అవకాశాల కోసం తిరగకుండానే తేజ లాంటి పెద్ద దర్శకుడి రూపంలో ఆ యువకుడికి హీరోగా అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రయత్నాలు చేయకుండా వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు, కృష్ణవంశి లాంటి బడా డైరెక్టర్లు తనని హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. అతి చిన్న వయసులోనే స్టార్ అయిపోయాడు. కాలం అడ్డం తిరిగింది. వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. స్టార్ హోదా పోయింది. దగ్గరి వాళ్లు దూరమయ్యారు. అయినా ‘ధైర్యం’గా నిలబడ్డాడు. తప్పిదాలు తెలుసుకున్నాడు. ఆచి తూచి కథలు ఎంచుకున్నాడు. ‘ఇష్క్’తో పనిచేశాడు. పుష్కరకాలం తర్వాత మళ్లీ వి‘జయం’ వరించింది. తనదైన నటనతో ప్రేక్షకుల ‘దిల్’లో స్థానం సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అతనే యంగ్ హీరో నితిన్. ఈ ‘అల్లరి బుల్లోడి’ 38వ పుట్టిన రోజు నేడు (మార్చి 30). ఈ సందర్భంగా నితిన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ► నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి.1983 మార్చి 30న సుధాకర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు నిజామాబాద్‌లో జన్మించాడు. ► నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పాపులర్ డిస్ట్రిబ్యూటర్. ► నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. ► 2002లో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడ నితన్ ► తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును గూడ అందుకున్నాడు ► దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది ► ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్‌కి. ► 2012లో వచ్చిన 'ఇష్క్' సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు ► 2020లో వెంకి కుడుముల రూపొందించిన ‘భీష్మ’తో మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు ► ఈ ఏడాది చెక్‌తో ఎంట్రీ ఇచ్చి.. తాజాగా రంగ్‌దే మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు ► హీరోగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగా తనకంటూ ప్రత్యే గుర్తింపు తెచ్చుకున్నాడు ► పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమను 28సార్లు చూసి పవర్ స్టార్‌కు వీరాభిమానిగా మారాడు. ► జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్ వివాహం జరిగింది. ఈ వేడుకకి పవన్ కల్యాణ్ హాజరయ్యాడు ► నితిన్ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. -
బోట్ కోసం కీర్తి పరుగులు.. ఆపండి ఆపండంటూ!
నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి సురేష్ ప్రస్తుతం వరుపగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నటించిన రంగ్‌దే చిత్రం శుక్రవారం(మార్చి16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో నితిన్‌కు జోడిగా నటించిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్‌కు ముందు నుంచే షూటింగ్లో జరిగిన ఫన్నీ వీడియోలను సోషల్ మడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. నితిన్, కీర్తి ఒకరినొకరు ఆటపట్టించడం, కీర్తి రకరకాల చీరలతో కనిపించడం,నలుగురు తినాల్సిన ఆహారాన్ని హీరోయిన్ ఒక్కతే తినడం వంటి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ సినిమా హిట్ వైపుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. తాజాగా మరో వీడియోను కీర్తి తన అభిమానులతో పంచుకుంది. వీకెండ్ కోసం పరిగెత్తుతున్నట్లు’ అనే క్యప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం పరుగులు పెడుతూ కనిపిస్తోంది. బోట్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఆపండి అంటూ అరుస్తూ కీర్తి పలుగులు పెట్టడం నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్లర్లు కొడుతుంది. దీనిపై కీర్తి అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో పై మీరూ చూసేయండి. చదవండి: హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘రంగ్‌దే’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగ్‌దే జానర్: రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : నితిన్, కిర్తి సురేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : వీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం ఎడిటింగ్ : నవీన్ నూలీ విడుదల తేది : మార్చి 26, 2021 గతేడాది ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్’ మూవీకి ప్రేక్షకులు చెక్ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్ దే’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేడయంతో ‘రంగ్‌దే’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రంగ్‌దే’ టీమ్ అందుకుందా? నితిన్ కెరీర్లో 29వ సినిమాగా వచ్చిన ‘రంగ్‌దే’ని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ అర్జున్(నితిన్) చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కింట్లోకి వచ్చిన అను(కీర్తి సురేష్) టాపర్. దీంతో ప్రతిసారి అర్జున్ వాళ్ల నాన్న(నరేశ్)అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతంద. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారు అనేదే మిగతా కథ. నటీనటులు అల్లరిగా తిరిగే అర్జున్ పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడు. క్యూట్ అండ్ స్టైలీష్ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో అవలీలగా నటించాడు. నచ్చని భార్యతో కాపురం చేయమంటే ఎంత చికాకుగా ఉంటుందో అర్జున్ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కీర్తి సురేష్ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మహానటి అనిపించుకుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్, అభినవ్ గౌతమ్ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్, సత్యం రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ ఇది. సహజంగానే మనం మన ఇంట్లోవాళ్లను పక్కింటివాళ్లతో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ‘రంగ్ దే’ సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే స్లో నెరెషన్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో సినిమానే బాగానే నడిపిన, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం కాస్త ప్రతికూల అంశమే ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్, అనుల టామ్ అండ్ జెర్రీ వార్ యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్లస్ పాయింట్స్ నితిన్, కీర్తి సురేష్ నటన కామెడీ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరి స్లో నెరేషన్స్ సెకండాఫ్ సాగదీత సీన్లు వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నాకన్నా నితిన్, కీర్తి ఎక్కువ నమ్మారు’
‘‘నా జీవితంలోని ప్రేమకథలనే నేను సినిమాలుగా తీస్తున్నానని కొందరు అంటారు. అది కరెక్ట్ కాదు. నా జీవితంలో ప్రేమకథలే లేవు. నా తొలి రెండు చిత్రాలు ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’లో ఎంటర్టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ‘రంగ్ దే’లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు వెంకీ అట్లూరి. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్ దే’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు. ► ‘రంగ్ దే’ కథను నితిన్ కు చెప్పినప్పుడు ఆయన కమర్షియల్ సినిమా ‘భీష్మ’ చేస్తున్నారు. అలాగే ‘పవర్‌పేట’ అనే ఓ పొలిటికల్ మూవీ కమిటయ్యారు. ఈ సమయంలో నా కథకు ఓకే చెబుతారా? అనిపించింది. కానీ ఓకే అన్నారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నితిన్, కీర్తి సినిమాకు ఓకే చెప్పారు. ఈ కథను ఇద్దరూ నాకన్నా ఎక్కువగా నమ్మారు. వారి నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది. ► పక్క పక్క ఇళ్లల్లో ఉండే ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య చదువు, కెరీర్... ఇలా ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు. అందుకే మొదట్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ‘రంగ్ దే’ కథ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కెమెరా మ్యాన్ పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం వల్ల దర్శకుడిగా మెరుగయ్యాను. నా తర్వాతి సినిమాను సితార, ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. -
హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్
నితిన్- కీర్తి సురేష్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్లో టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్న వీరిద్దరూ రియల్లైఫ్లోనూ తెగ హంగామా చేసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఇది స్ఫష్టంగా కనిపిస్తుంది. రంగ్ దే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది.షూటింగ్ గ్యాప్‌లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్ ఫొటోను ఎడిట్ చేసి ఆడుకుంది. ఇటీవలె అను కనిపించడం లేదంటూ హీరోయిన్ కీర్తి రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి ఆమెను ఆటపట్టించారు నితిన్. తాజాగా కీర్తి సురేష్ వల్ల తమ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఓ ఈవెంట్ అనంతరం రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తిందామని రెడీగా పెట్టుకున్న తమకు కీర్తి షాకిచ్చిందని, మేం తినే తిండి మొత్తం కీర్తి ఒక్కతే తింటుందంటూ బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాకుండా నితిన్‌కి సపోర్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చేరి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడుతూ కీర్తిని ఆట పట్టించారు. అయితే ఇవేమీ పట్టించుకోని కీర్తి...హ్యాపీగా తనకు ప్లేట్లోని ఐటెమ్స్‌ను తింటూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నితిన్- కీర్తి చేస్తున్న అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటిసారి వీరిద్దరూ జోడిగా కలిసి నటించిన రంగ్‌దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. All Our DINNER being eaten by One Person.. ANU.. 🙈🙈🙈 BusStande BusStande Ika Bathuke BusStande.. 😂🤣😂🤣@actor_nithiin @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts @ShreeLyricist @pcsreeram @haarikahassine pic.twitter.com/KeiPEPh8N1 — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 24, 2021 చదవండి : కీర్తి సురేశ్ మిస్సింగ్: నితిన్ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై! హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి -
హల్చల్ చేస్తోన్న ‘రంగ్‌దే’ మేకింగ్ వీడియో..
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషనల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్ నూలి ఎడిటర్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ‘చూసి నేర్చుకోకు’ అనే బ్యాక్‌గ్రౌండ్ పాటతో కొన్ని మేకింగ్ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకుముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రానున్న విషయం తెలిసిందే. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. చదవండి: తలైవి ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా అతనే! -
'రంగ్‌దే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్ దే'
‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్. నితిన్ , కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్, అను) క్యారెక్టర్స్ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్ దే’ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ నాకు బ్రదర్. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్ జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్ మూవీస్ తర్వాత నాకో హిట్ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్. దేవిశ్రీతో నాది ఫస్ట్ కాంబినేషన్ . మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్ , కీర్తీ సురేష్‌కు థ్యాంక్స్. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లు జరగకపోయినా చిత్రయూనిట్ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ ‘రంగ్ దే’. నితిన్ కెరీర్లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట!
సాధారణంగా మనలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లు ఫాలో అయితేనే అనుకున్న పని అనుకున్న విధంగా జరుగుతుందని నమ్ముతారు. ఇక చిత్రపరిశ్రమలో అయితే ఈ సెంటిమెంట్లు మరీ ఎక్కువ. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుకల వరకు దర్శకనిర్మాతలు, హీరోలు ఒక్కో సమయంలో ఒక్కో విధమైన సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా హీరో నితిన్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరైతే విజయం వరిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. అందుకే రంగ్‌దే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తున్నాడు. గతేడాది నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్‌కి నితిన్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఆ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరు మరింత క్లోజ్ అయ్యారు. శిష్యుడిగా తన దగ్గర్నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు నితిన్. అప్పట్నుంచి నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. అప్పట్లో ఆయన అందించిన కథతో ఛల్ మోహన్ రంగా సినిమా చేశాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసినపుడు కూడా అండదండలు అందించాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాకు కూడా ఈయన వెంటే ఉన్నాడు. మరి నితిన్ సెంటిమెంట్ ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్ హీరోయిన్ కనబడుట లేదు: డోంట్ వర్రీ అంటున్న పోలీసులు -
వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్
‘‘కర్నూలుకు రావడం ఇదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్టయ్యాయి. ఆ ప్రదేశం ఎంత పవర్ఫుల్లో మీరూ (కర్నూలువాసులను ఉద్దేశించి) అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నారు’’ అని హీరో నితిన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను కర్నూలులో నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డీజీ భరత్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రంగ్ దే’ ఘనవిజయం సాధించాలి. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్‌ను కోరుతున్నాం’’ అన్నారు హఫీజ్ ఖాన్, సుధాకర్. నితిన్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలకు కీర్తీ సురేశ్, వెంకీ అట్లూరి రావాల్సింది.. కానీ ఇద్దరూ హ్యాండిచ్చారు. రాయలసీమ అంటే మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ఎక్కువ ప్రేమ ఉంది. ఇదే ప్రేమతో మా సినిమా చూసి, హిట్టివ్వండి’’ అన్నారు. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగవంశీ.