
‘‘కర్నూలుకు రావడం ఇదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్టయ్యాయి. ఆ ప్రదేశం ఎంత పవర్‌ఫుల్లో మీరూ (కర్నూలువాసులను ఉద్దేశించి) అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నారు’’ అని హీరో నితిన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను కర్నూలులో నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డీజీ భరత్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘‘రంగ్ దే’ ఘనవిజయం సాధించాలి. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్‌ను కోరుతున్నాం’’ అన్నారు హఫీజ్ ఖాన్, సుధాకర్. నితిన్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలకు కీర్తీ సురేశ్, వెంకీ అట్లూరి రావాల్సింది.. కానీ ఇద్దరూ హ్యాండిచ్చారు. రాయలసీమ అంటే మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ఎక్కువ ప్రేమ ఉంది. ఇదే ప్రేమతో మా సినిమా చూసి, హిట్టివ్వండి’’ అన్నారు. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగవంశీ.
Comments
Please login to add a commentAdd a comment