
ఎవరికి ఉండాలి? ఎందుకు ఉండాలి? అంటే... అవకాశం ఇచ్చినవారి పట్ల విశ్వాసంగా ఉండాలి. అలా ఉండాలని రూలేం లేదు. అది వ్యక్తుల విజ్ఞత, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు హీరో అజిత్ – దర్శకుడు శివలను తీసుకుందాం. వేదాలం, వీరం, వివేగమ్... ఇలా ‘వి’ అక్షరం పేరున్న మూడు హిట్ సిన్మాలు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. అవకాశం ఇచ్చిన అజిత్ పట్ల దర్శకుడు శివకు విశ్వాసం ఉండాలా? లేక మూడు హిట్ సిన్మాలిచ్చారు కాబట్టి శివ పట్ల అజిత్ విశ్వాసంగా ఉండాలా? అంటే... సమాధానం చెప్పడం కష్టమే.
అయితే.. తమిళంలో స్టార్ హీరోగా దూసుకెళుతోన్న అజిత్.. అప్‌కమింగ్ డైరెక్టర్ శివకు అవకాశం ఇవ్వడం మాత్రం గ్రేటే. ఇంతకీ విశ్వాసం గురించి ఈ రేంజ్‌లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... అజిత్ హీరోగా శివ దర్శకత్వం వహించనున్న నాలుగో చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో అజిత్ పోలీసాఫీసర్‌గా నటించబోతున్నారట. ‘‘జనవరిలో షూటింగ్‌ను స్టార్ట్ చేసి దీపావళికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని సత్య జ్యోతి ఫిలిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి సిద్దార్థ్ పేర్కొన్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు కాజల్, కీర్తీ సురేశ్ పేర్లను పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. అదీ గాక... ఆల్రెడీ అజిత్–శివ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘వివేగమ్’ చిత్రంలో కాజల్, ‘హాసిని’ పాత్రలో నటించారు. సో... కాజల్‌నే ఫైనల్ హీరోయిన్‌గా ఫిక్స్ అవుతారని కొందరు గాసిప్ రాయుళ్లు జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లేనా? లేక మరోకరు ఎవరైనా ఈ ఛాన్స్ కొట్టేస్తారా? అనేది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగక తప్పదు. ‘విశ్వాసం’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment