‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ మారుతుందని ప్రచారం జరుగుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఆదివారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘ఆచార్య’ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు.
అయితే తాజాగా ‘ఆచార్య’ చిత్రం వాయిదా పడనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. దీంతో ఈ విషయంపై నిర్మాతలు స్పందిస్తూ – ‘‘ఆచార్య’ సినిమా రిలీజ్‌డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆల్రెడీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ముందుగా ప్రకటించినట్లే ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు. దీంతో ‘ఆచార్య’ రిలీజ్ ఆన్ ట్రాక్‌లో ఉందని హ్యాపీ ఫీలవుతున్నారు మెగా ఫ్యాన్స్. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment