దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. రెజీనా స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా ఆచార్య ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ వారం ఉదయ్‌పూర్‌లో నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉండటంతో దానికి హాజరైన తర్వాత వెంటనే చిరంజీవి సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జనవరి మూడో వారంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. చదవండి: జనవరిలో రామ్ చరణ్ ఎంట్రీ
తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆచార్య షూటింగ్‌లో భాగంగా ఓ భారీ సెట్ వేయనున్నారు. ఇందుకు ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర నిర్మాతలు 4 కోట్లతో ఒక ఆలయ సెట్‌ను నిర్మించారు. ఇప్పుడు ఇదే సెట్‌లో చిరంజీవితో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు హైదరాబాద్‌లోనే కేరళ బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామాన్ని నిర్మించారు. దీంతో ఆలయంతోపాటు గ్రామాన్ని నిర్మించేందుకు సుమారు 20 రూపాయల కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా నిర్మించిన ఈ సెట్ 16 ఎకరాలలో విస్తరించి ఉండగా.. దీని పర్యవేక్షణ బాధ్యతలన్ని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నారు. చదవండి: ఆచార్య సెట్‌లో సోనూసూద్‌కు సత్కారం
Comments
Please login to add a commentAdd a comment