Acharya: కాకినాడ కాలింగ్‌ | Acharya next shooting shedule at kakinada | Sakshi
Sakshi News home page

Acharya: కాకినాడ కాలింగ్‌

Published Thu, Jul 29 2021 12:34 AM | Last Updated on Thu, Jul 29 2021 12:42 AM

Acharya next shooting shedule at kakinada - Sakshi

హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ‘ఆచార్య’ లొకేషన్‌ షిఫ్ట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను కాకినాడలో ప్లాన్‌ చేశారని టాక్‌.

మూడు నుంచి ఐదు రోజులు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చిరంజీవి, సోనూసూద్‌ కాంబినేషన్‌లో సీన్స్‌ తెరకెక్కిస్తారట. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్‌’గా తెలుగులో రీమేక్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్‌’, ‘ఫిల్మ్‌ మేకర్‌’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement