
చిరంజీవి, రామ్‌చరణ్
ధర్మానికి ధైర్యం తోడైన వేళ శత్రుసంహారానికి ఆచార్య సిద్ధమయ్యాడు. సిద్ధతో సహా ముందుడుగు వేశాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
శనివారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో తండ్రీకొడుకులు కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘మీతో కలిసి నటించడంతో నా కల నెరవేరినట్లు ఉంది నాన్నా. ఇంతకన్నా నాకు బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది’’ అని, ‘లాహి లాహి...’ పాటలో వింటేజ్ మెగాస్టార్‌ని చూస్తారని ప్రామిస్ చేస్తున్నాం అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ‘ఆచార్య’లోని ‘లాహి లాహి...’ అనే పాట లిరికల్ వీడియోను మార్చి 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ పాటకు సంబంధించి చిరంజీవి ఫొటోను విడుదల చేశారు. మే 13న ఈ సినిమా రిలీజ్.
Comments
Please login to add a commentAdd a comment