Namrata And Keerthy’s BTS picture from SVP: మహేశ్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని స్పెయిన్ వెళ్లారు. ఓ వైపు మహేశ్ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్‌లో ఉన్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్రీకరణలో స్పెయిన్‌లో ముగిసింది.
చివరి రోజున సినిమా సెట్స్‌లో మహేశ్ భార్య నమ్రత సందడి చేసింది. సాంగ్ షూట్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది.
చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే..
Hyper Aadi: ఏడాదికి హైపర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment