సర్కారు వారి పాట: ఫైనల్‌ షూటింగ్‌ | Mahesh Babu Shoots For The Final Song From Sarkaru Vaari Paata | Sakshi
Sakshi News home page

సర్కారు వారి పాట: ఫైనల్‌ షూటింగ్‌

Published Tue, Apr 19 2022 8:18 AM | Last Updated on Tue, Apr 19 2022 8:20 AM

Mahesh Babu Shoots For The Final Song From Sarkaru Vaari Paata - Sakshi

‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌ ఒక్క పాట మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రం హీరో హీరోయిన్లు మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ప్రస్తుతం జరుగుతున్న పాట చిత్రీకరణ పూర్తయితే చిత్రయూనిట్‌ గుమ్మడికాయ కొడతారు. అంటే.. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయిపోతుంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘సర్కారువారి పాట’ చిత్రం మే 12న రిలీజ్‌ కానుంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement