Natural star Nani 'Dasara' trailer launched today - Sakshi
Sakshi News home page

Dasara Trailer: నాని దసరా.. ట్రైలర్‌ అదిరిపోయిందిగా..!

Published Tue, Mar 14 2023 5:28 PM | Last Updated on Tue, Mar 14 2023 5:49 PM

natural Star Nani Dasara Trailer Released Today - Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. బొగ్గు గనుల నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 

ట్రైలర్‌ చూస్తే ' చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ' అనే పాటతో మొదలైంది. నాని ఫుల్‌ మాస్‌ లుక్‌లో అలరించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడో లిరికల్‌ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను ధీ - రామ్ మిర్యాల ఆలపించగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పక్కా జానపథ యాసలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement