ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి ఇంకో రెండు నెలలు ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి నెల షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఈలోపు ఈ చిత్రంలో నటించబోయే నాయికలు, సహాయ నటీనటుల గురించి చర్చలు మొదలయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్‌లను తీసుకున్నారని ఓ టాక్. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉందని మరో టాక్. తాజాగా, టబు పేరు సీన్లోకొచ్చింది. ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారని సమాచారం.
‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్‌లో నదియా సెకండ్ ఇన్నింగ్స్ వైభవంగా మొదలయ్యాయి. టబు పాత్రను కూడా త్రివిక్రమ్ ఆ రేంజ్‌లో డిజైన్ చేశారట. ఇప్పటికే అఖిల్ ‘హలో’ లో, నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ సినిమాలోనూ టబు కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఫైనల్లీ ఈ పొడుగుకాళ్ల సుందరి ఎన్ని సినిమాల్లో కనిపిస్తారో చూడాలి. ఆ సంగతలా ఉంచితే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ గడ్డంతో కనిపించిన చిన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లీన్ షేవ్‌లో చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment