రాధాకృష్ణ, త్రివిక్రమ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది. ‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి హ్యాట్రిక్ పై గురి పెట్టారని ఊహించవచ్చు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలు. శనివారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది.
అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. ప్రత్యేక పాత్రలో హీరో సుశాంత్ కనిపిస్తారు. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ తమన్. కెమెరా: పి.యస్ వినోద్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, ఎడిటర్: నవీన్ నూలి.
Comments
Please login to add a commentAdd a comment