Actress Keerthy Suresh Political Entry News Trending On Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh Political Entry: రాజకీయాల్లోకి కీర్తి సురేష్‌.. ప్రచారానికి కారణం ఇదే

Published Mon, Jun 26 2023 8:05 AM | Last Updated on Mon, Jun 26 2023 8:52 AM

Keerthy Suresh Political Entry News Viral - Sakshi

దక్షిణాదిన స్టార్‌ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు కీర్తిసురేష్‌. ఆమె ఒక పక్క గ్లామర్‌ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఆమె మదిలో చాలా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిగా దూసుకుపోతున్నా, మరోపక్క వదంతులు వలయంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ, ప్రేమికుడు వంటి ప్రచారం ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు చదువుతుంటే బాధేస్తుందని కీర్తిసురేషే ఇటీవల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్‌' విలన్‌.. నేడు సర్జరీ)

ఇక కెరీర్‌ విషయానికి వస్తే ఈ మధ్య తెలుగులో బిజీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె అక్కడ నటిస్తున్న చిత్రాలలో 'మామన్నన్‌' ఒకటి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న తెరపైకి రానుంది. దీంతో కీర్తిసురేష్‌ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మామన్నన్‌ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్‌ పాత్ర అని తెలిపారు. సమీకాలంలో తనకు ఈ తరహా పాత్రలే వస్తున్నాయన్నారు.

(ఇదీ చదవండి: 'నేనో ఇంజనీర్‌ని.. హీరోయిన్‌ అవుతాననుకోలేదు')

ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, ఆ విషయం గురించి ఆలోచించాలని అన్నారు. దీంతో రాబోయేరోజుల్లో రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాల్లో నిజమే కావచ్చని పలువురు తెలుపుతున్నారు. ప్రస్థుతం ఆమె తాజా చిత్రంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్‌ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది.

కానీ గతంలోనూ కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయగా ఆమె తల్లి మేనక వాటిలో నిజం లేదని, తమ కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదని స్పష్టం చేసింది. కానీ ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో  రాజమౌళి, శంకర్‌ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement