మళ్లీ శింబుతోనా?
సంచలన నటుడు శింబు పేరెత్తితే నే నటి హన్సిక బెంబేలెత్తిపోతున్నారనిపిస్తోంది. ఆయనతో రెండు చిత్రాల్లో నటించిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రాల షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య లవ్ మొదలైంది.అది ఎంతవరకు వెళ్లిందంటే పేళ్లి అంచుల వరకు. అయితే ఆ పెళ్లి కథ మాత్రం పలు ప్రకంపనల తరువాత కంచికే చేరింది. మొత్తం మీద శింబు హన్సిక నటించిన వాలు చిత్రం అతి కష్టం మీద పూర్తి అయ్యి తెరపైకి వచ్చింది. మరో చిత్రం వేట్టై మన్నన్‌కు ఇంకా మోక్షం కలగలేదు. శింబు తాజాగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.
త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒక పాత్రలో 1980 పాత పాత్రలో నటించడం విశేషం.కాగా ఈ పాత్రకు జంటగా నటి శ్రీయ నటిస్తున్నారు. మెయిన్ నాయకి పాత్రలో హన్సిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆమె చెవిన పడింది. అంతే అయ్యయ్యో అంటూ బెంబేలెత్తిపోయింది. శింబు సరసన మళ్లీనా? అంటూ అదంతా అసత్య ప్రసారం అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అసలు విషయం ఏమిటంటే శింబు మొదటి మాజీ ప్రియురాలు నయనతార ఇటీవల ఇదునమ్మఆళు చిత్రంలో ఆయనతో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో మాజీ ప్రియురాలు హన్సికను నటింపచేయాలని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం. ఇదే విషయం కాస్త అటూ ఇటుగా ప్రచారం అవడంతో హన్సిక కంగారు పడిపోయారట. ఇప్పుడీ చిత్రంలో నటి కీర్తీసురేశ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.