మళ్లీ కలిశారు! | Hansika open talk about Simbu love | Sakshi
Sakshi News home page

మళ్లీ కలిశారు!

Published Thu, Mar 7 2019 2:46 AM | Last Updated on Thu, Mar 7 2019 5:38 AM

Hansika open talk about Simbu love - Sakshi

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది సామెత. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే.. కొందరు కలిసి నటించడం.. ప్రేమలో పడటం చకచకా జరిగిపోతాయి. ప్రేమలో ఉన్నన్నాళ్లూ చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే టైమ్‌లో లవ్‌కి బ్రేకప్‌ చెబుతుంటాయి కొన్ని జంటలు. అలా విడిపోయిన జంటల్లో శింబు, హన్సిక కూడా ఉన్నారు. విడిపోయాక కలిసి సినిమాలు చేయడం మానేసే జంటలు.. ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మార్చుకుని కలిసి నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుంటారు.

శింబు, హన్సిక కూడా బ్రేకప్‌ తర్వాత కలిసి నటించడం మానేశారు. ఇప్పుడు హన్సిక 50వ చిత్రం ‘మహా’లో నటించడానికి శింబు అంగీకరించారు. యు.ఆర్‌. జమీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్లతో వివాదాస్పదం అయ్యింది. దాంతో ఈ సినిమాపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంత క్రేజ్‌ ఉన్న సినిమాకు అదనపు ఆకర్షణ జోడించాలనే ఉద్దేశంతో శింబుతో అతిథి పాత్ర చేయిస్తున్నారట జమీల్‌. ‘ఈ విషయాన్ని మేమే చెప్పాలనుకున్నాం. కానీ ముందే బయటికొచ్చేసింది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’’ అని హన్సిక స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement