శింబు చిత్రానికి హైకోర్టు బ్రేక్
వాలు చిత్రానికి హైకోర్టు బ్రేక్ వేసింది. శింబు, హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయనున్నట్లు టి.రాజేందర్ ప్రకటించారు. అయితే మ్యాజిక్ దేస్ సంస్థ వాలు విడుదల హక్కులు తాము పొందినట్లు ఈ చిత్రాన్ని వేరే వ్యక్తి విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు వాలు చిత్ర విడుదలకు పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ కేసులో తమను ప్రతివాదిగా చేర్చుకోవాలని టి.రాజేందర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. టి.రాజేందర్ పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. చిత్ర నిర్మాత చక్రవర్తి తరపు వాదనలను మేజిక్ దాస్ సంస్థ తరపు వాదనలు విన్న న్యాయస్థానం వాలు చిత్ర విడుదలపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వాలు చిత్రంపై నిషేధం విధించాలంటూ మరో ఐదు పిటిషన్‌లు కోర్టులో దాఖ లయ్యాయి. వీటిపై బుధవారం విచారణ జరగనుంది. దీంతో చిత్రం ఈ నెల 17న విడుదల సాధ్యం కాదని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.