వారి మనసే మారుతోంది | shimbu new love story starts with hansika | Sakshi
Sakshi News home page

వారి మనసే మారుతోంది

Published Sat, May 3 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

వారి మనసే మారుతోంది

వారి మనసే మారుతోంది

తన ప్రేమ ఒకే రీతిలో ఉందని, అయితే ప్రియురాళ్ల మనసే మారుతోందని నటుడు శింబు వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. శింబు, నయనతారల మధ్య ప్రేమ వ్యవహారం ముగిసిన తర్వాత హన్సికతో ప్రేమాయణం మొదలైంది. ఇదీ ప్రస్తుతం తెగతెంపులకు దారితీసింది. వాలు చిత్రంలో జనించిన ఈ ప్రేమ ఆ చిత్ర షూటింగ్ ముగిసేలోపే అంతమైంది. దీంతో షూటింగ్ చివరి షెడ్యూల్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారం నిర్మాతల సంఘంలో పంచాయతీ వరకు వెళ్లింది.  ప్రస్తుతం బెంగుళూరులో శింబు, హన్సిక డ్యూయెట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ అనుభవం గురించి హన్సికతో మాట్లాడగా ఈ చిత్రాన్ని ముగించాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను శింబు కోసం నటించలేదన్నారు. డెరైక్టర్ కోసమే నటిస్తున్నానని తెలిపారు. తాను జరిగిన దాని గురించి ఆలోచించడం లేదని, భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. దీని గురించి శింబు వద్ద విలేకరులు ప్రశ్నించగా మాజీ ప్రియురాలితో నటించడం కొత్తకాదని అన్నారు. తన ప్రేమ ఒకే రీతిలో ఉందని, అయితే ప్రియురాళ్ల మనస్తత్వమే మారుతోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement