ఆమే నా రోల్‌మోడల్ | She is my rolmodal | Sakshi
Sakshi News home page

ఆమే నా రోల్‌మోడల్

Published Thu, Jul 7 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

ఆమే నా రోల్‌మోడల్

ఆమే నా రోల్‌మోడల్

నయనతార తనకు రోల్‌మోడల్ అంటున్నారు. యువ నటి కీర్తీసురేశ్. నీ నవ్వే చాలు పూబంతీ అన్న పాటను ఈ బ్యూటీకి సరైన వర్ణన అనొచ్చు. ఇటీవల ఒక కార్యక్రమంలో సీనియర్ దర్శకుడొకరు కీర్తీ నటించనక్కర్లేదు. తన నవ్వు కోసమే అభిమానులు సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు అని అన్నారు. అంత వశీకరణ నవ్వు ఆమెది. ఇప్పటికీ తన చిత్రాలు తెరపైకి వచ్చింది రెండే అయినా 10,15 సక్సెస్‌ఫుల్ చిత్రాలంత ప్రాచుర్యాన్ని పొందారు. ఒక్క రజనీమురుగన్ కీర్తీసురేశ్‌ను చాలా ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టిందని చెప్పకతప్పదు. తన బాబీసింహాతో నటించిన పాంబుసండై, ధనుష్ సరసన నటించిన తొడరి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో రెమో, విజయ్‌కు జంటగా ఒక  చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ 60వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకున్న కీర్తి ఆయన సహృదయుడు, సెట్‌లో ఉంటే చాలా సరదాగా ఉంటారు అంటూ పొగడ్తల పురాణం మొదలెడుతున్నారు.


తన అభిమాన హీరో విజయ్ అని అన్న కీ ర్తి నటిగా తనకు స్ఫూర్తి మాత్రం నయనతార అని అన్నారు. ఆమెలో మీకు అంతగా నచ్చిన అంశం ఏమిటన్న ప్రశ్నకు నయనతారకు హిందీలో ఎన్నో అవకాశాలు వచ్చినా అటు వైపు కన్నెత్తి చూడకుండా ఇక్కడే నటిస్తున్నారన్నారు. ఉన్నది వదిలి లేనిదాని కోసం పరుగెత్తాలని ఆశ పడకూడదన్న ఆమె ఫార్ములా తనకు బాగా నచ్చిందని, తాను అదే ఫార్ములాను అనుసరిస్తున్నానని కీర్తీసురేశ్ పేర్కొన్నారు. అంతా బాగానే ఉంది ప్రేమ విషయంలో నయనను స్ఫూర్తిగా తీసుకోకుంటే బెటర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement