
కీర్తీ సురేష్
కెరీర్‌లో ‘మైల్‌స్టోన్’ అని చెప్పుకునే అవకాశాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ‘మహానటి’ రూపంలో కీర్తీ సురేష్ కెరీర్‌లో ఓ మంచి మైల్‌స్టోన్ వచ్చి చేరింది. నటిగా సినిమా సినిమాకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళుతోన్న కీర్తి ఇప్పుడు తన కెరీర్‌లో ‘మ్యాజికల్ మైల్‌స్టోన్’ చేరుకున్నానని అంటున్నారు. మరి.. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశం అంటే.. ఏదో మ్యాజిక్ జరిగినట్లే కదా. రజనీ 168వ సినిమాలో కీర్తీకి ఈ చాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ‘‘రజనీకాంత్ సార్ సరసన నటించడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంలాంటిది. నా సినిమా కెరీర్‌లో ఇదొక ‘మ్యాజికల్ మైల్‌స్టోన్’’ అన్నారు కీర్తీ సురేష్.