సాక్షి, హైదరాబాద్: నితిన్ లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ ప్రమోషన్‌లో భాగంగా ప్రిన్స్ మహేహ్‌బాబు అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు.‘‘ నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని…’’ పాట లిరికల్ వీడియోను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సింగర్ సిధ్ శ్రీరాంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాక్ స్టార్, అమేజింగ్ అంటూ ఇద్దరినీ పొగడ్తల్లో ముంచెత్తారు సూపర్ స్టార్. అటు డీఎస్‌పీ, సిద్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చస్తున్నారు.విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగ్‌దే' మూవీలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమా కూడా బంపర్‌హిట్ అనే అంచనాలతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment