రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్పై వివాదం | Ram gopal varma sparks controversy with savitri poster again | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్పై వివాదం

Published Sat, Oct 4 2014 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్పై వివాదం

రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్పై వివాదం

హైదరాబాద్ :  సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా మరోసారి వివాదస్పదంగా మారింది. ఆయన తాజా చిత్రం 'సావిత్ర'పై వివాదం రేగుతోంది. సావిత్రి సినిమా పోస్టర్పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సినిమా పోస్టర్పై కమిషన్... సుమోటో కింద కేసును స్వీకరించింది. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ వివాదానికి కారణం అయ్యాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాంగోపాల్ వర్మ ప్రెస్ నోట్ ఈ విధంగా ఉంది....

ప్రతి టీనేజర్ జీవితంలో ఒక సావిత్రి ఉంటుంది!
నేను స్కూల్లో చదువుకొనేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ 'సరస్వతి' అంటే నాకు పిచ్చెక్కిపోయేది!
ఆ సరస్వతే నా 'సావిత్రి'!
అలాగే మీ మీ జీవితాల్లో... మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్సో, మీ ట్యూషన్ టీచర్లో ...ఇలా రకరకాల 'సావిత్రి'లు ఉండే ఉంటారు!
అలా మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి ఇన్స్పిరేషన్తోనే ఈ 'సావిత్రి' సినిమా స్టార్ట్ చేస్తున్నాము!
ఈ సందర్భంగా 'మీ సావిత్రి ఎవరు?' అనే కాంటెస్ట్ మొదలుపెడుతున్నాము!
ఈ కాంటెస్ట్లో... మీ జీవితంలో మీకు ఎదురైన మీ 'సావిత్రి'లకి సంబంధించిన మీ అనుభవాలను మాతో naasaavitri.comలో పంచుకొంటే.. మీ ఆ అనుభవాలని కూడా మా 'సావిత్రి'లో పెడతాము!!
గెట్ లక్కీ విత్ 'సావిత్రి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement