savitri poster
-
వర్మ..ఓ నీతిమాలిన సైకో
దేవీచౌక్ (రాజమండ్రి) :మంచి, చెడుల విచక్షణను, నైతిక విలువలను మరిచిన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నగర శాఖ నాయకులు, కార్యకర్తలు మండిపడ్టారు. పవిత్రమైన గురుశిష్య సంబంధాలను కించపరుస్తూ వర్మ రూపొందించిన ‘సావిత్రి’ చిత్రాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద వర్మ దిష్టిబొమ్మను, అసభ్యకరంగా ఉన్న ‘సావిత్రి’ పోస్టర్లను దహనం చేశారు. పరిషత్ జిల్లా కో కన్వీనర్ చల్లా నవీన్లాల్ మాట్లాడుతూ మన సంప్రదాయంలో గురుశిష్య సంబంధం ఎంతో పవిత్రమైంది కాగా వర్మ దాన్ని తప్పుగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిషత్ జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్ బెజవాడ ప్రణీత్ మాట్లాడుతూ ‘వర్మ తాను చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ టీచరు సరస్వతి అంటే పిచ్చెక్కిపోయేదని, ఆ సరస్వతే తన ‘సావిత్రి’ అని అనడమే కాక ‘మీ జీవితాలోనూ అలాంటి సావిత్రులు ఉంటారు. వివరాలు తెలపండి’ అని బరి తెగించి ప్రచారం చేయడాన్ని ఖండించారు. సాయి భరద్వాజ్, సాయి, విజయ్, శ్రీనివాస్. అఖిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
వర్మ 'సావిత్రి' రేపిన దుమారం Part 1
-
సరస్వతి టీచర్ అభ్యంతరం చెప్పలేదు: వర్మ
హైదరాబాద్ : 'సావిత్రి' సినిమాపై ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. సాక్షి టీవీ చానల్లో 'సావిత్రి' సినిమాపై జరిగిన చర్చపై ఆయన ఫోన్లో మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికీ 'క్రష్' ఉంటుందని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పానని టీచర్ సరస్వతి తనను అభినందించారన్నారు. సావిత్రి సినిమాపై సరస్వతి టీచర్ అభ్యంతరం తెలపలేదని వర్మ అన్నారు. తనకున్న భావాలను సినిమా ద్వారా చెప్పే వాక్ స్వాతంత్ర్యం తనకుందని, నచ్చకపోతే చూడటం, చూడకపోవటం ఎదుటవారి ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు. తన జీవితంలో అలాంటి ఘటన జరిగిందని, అదే విషయాన్ని ఎవరి జీవితంలో అయినా జరిగితే చెప్పమన్నానని, లేకుంటే చెప్పాల్సిన అవసరం లేదని వర్మ ముక్తాయించారు. ఇక దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదని వర్మ ఖరాఖండిగా చెప్పారు. న్యాయపరమైన అంశాలు తనకు తెలియవని, తాను చెప్పదలచుకున్నది ప్రెస్‌నోట్‌లోనే చెప్పానంటూ ఫోన్ కట్ చేశారు. మరోవైపు వర్మ 'సావిత్రి' చిత్రంపై మహిళా సంఘాలతో పాటు, బాలలహక్కుల కమిషన్, పలువురు ఉపాధ్యాయులు అభ్యంతరం చెబుతున్నారు. వర్మకు మానసిక స్థితి సరిగా లేదంటూ మహిళా సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. -
రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్‌పై వివాదం
-
రాంగోపాల్ వర్మ సావిత్రి పోస్టర్‌పై వివాదం
హైదరాబాద్ : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా మరోసారి వివాదస్పదంగా మారింది. ఆయన తాజా చిత్రం 'సావిత్ర'పై వివాదం రేగుతోంది. సావిత్రి సినిమా పోస్టర్‌పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సినిమా పోస్టర్‌పై కమిషన్... సుమోటో కింద కేసును స్వీకరించింది. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ వివాదానికి కారణం అయ్యాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాంగోపాల్ వర్మ ప్రెస్ నోట్ ఈ విధంగా ఉంది.... ప్రతి టీనేజర్ జీవితంలో ఒక సావిత్రి ఉంటుంది! నేను స్కూల్లో చదువుకొనేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ 'సరస్వతి' అంటే నాకు పిచ్చెక్కిపోయేది! ఆ సరస్వతే నా 'సావిత్రి'! అలాగే మీ మీ జీవితాల్లో... మీ టీచర్లో, మీ పక్కింటి లేదా ఎదురింటి ఆంటీలో, మీ అక్క ఫ్రెండ్సో, మీ ట్యూషన్ టీచర్లో ...ఇలా రకరకాల 'సావిత్రి'లు ఉండే ఉంటారు! అలా మీ అందరి జీవితాల్లో తారసపడిన ఆ సావిత్రులందరి ఇన్స్పిరేషన్తోనే ఈ 'సావిత్రి' సినిమా స్టార్ట్ చేస్తున్నాము! ఈ సందర్భంగా 'మీ సావిత్రి ఎవరు?' అనే కాంటెస్ట్ మొదలుపెడుతున్నాము! ఈ కాంటెస్ట్‌లో... మీ జీవితంలో మీకు ఎదురైన మీ 'సావిత్రి'లకి సంబంధించిన మీ అనుభవాలను మాతో naasaavitri.comలో పంచుకొంటే.. మీ ఆ అనుభవాలని కూడా మా 'సావిత్రి'లో పెడతాము!! గెట్ లక్కీ విత్ 'సావిత్రి'