నారావారి అబ్బాయి కూడా..! | nara rohit to croon for savitri | Sakshi
Sakshi News home page

నారావారి అబ్బాయి కూడా..!

Published Wed, Feb 24 2016 10:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

నారావారి అబ్బాయి కూడా..! - Sakshi

నారావారి అబ్బాయి కూడా..!

ప్రస్తుతం టాలీవుడ్ నటీనటులు.. నటనతో పాటు ఇతర రంగాల మీద కూడా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంతో పాటు గాయకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలందరూ తమ సినిమాల్లో పాటలు పాడగా.., అలీ, జయప్రకాష్ రెడ్డి లాంటి కమెడియన్లు కూడా ఈ లిస్టులో చేరిపోయారు. తాజాగా మరో యంగ్ హీరో కూడా అదే పనికి రెడీ అవుతున్నాడు.

తెలుగులో మరే హీరో లేనంతగా బిజీగా పది సినిమాలు చేస్తున్న నారా రోహిత్.. అంత బిజీలోనూ తన నెక్ట్స్ సినిమాలో పాట పాడటానికి సమయం కేటాయించాడు. శ్రవణ్ సంగీత దర్శకత్వంలో రోహిత్ పాడిన పాట త్వరలోనే రిలీజ్ కానుంది. పవన్ సాధినేని దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 25న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement