![Upendra Gadi Adda Movie Teaser launch - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/29/Upendra%20gadi%20Adda.jpg.webp?itok=TLfNVCyg)
కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఎస్‌కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సంగీత దర్శకురాలు ఎమ్‌ఎమ్ శ్రీలేఖ టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘‘సోషల్ మీడియాలో మంచిని పెంపొందిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తాం. అలాగే 75 శాతం వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్. అచ్యుత రావుతో పాటు చిత్ర సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment