సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో... | Nara Rohit's Savitri Movie Release Date Confirmed! | Sakshi
Sakshi News home page

సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో...

Published Wed, Mar 16 2016 10:48 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో... - Sakshi

సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో...

 సినిమా పేరు ‘సావిత్రి’. అది అమ్మాయి పేరు. ఈ టైటిల్‌తో నారా రోహిత్ సినిమా చేస్తున్నాడంటేనే సమ్‌థింగ్ డిఫరెంట్ అని అర్థమవుతోంది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం పవన్ సాదినేని దర్శకత్వంలో వీబీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇందులో నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా నిర్మించాం. కుటుంబ సభ్యులందరూ కలిసి హాయిగా చూడొచ్చు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ‘సావిత్రి’పై భారీ అంచనాలు నెలకొనడానికి ఇవి ఓ కారణం అయ్యాయి. సాయికార్తీక్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement