మహానటి పాత్రలో విద్యా..? | Vidya Balan approached for biopic on Telugu actor Savitri | Sakshi
Sakshi News home page

మహానటి పాత్రలో విద్యా..?

Published Thu, Jul 28 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

మహానటి పాత్రలో విద్యా..?

మహానటి పాత్రలో విద్యా..?

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ అశ్విన్ ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మహానటి సావిత్రి జీవిత కథతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు అశ్విన్. ఇప్పటికే కథ కథాలను పూర్తి చేసిన ఈ యువ దర్శకుడు, సావిత్రి పాత్రలో కనిపించే నటి కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాడు.

అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించాలి. ఆహార్యంలోనే సావిత్రిని గుర్తు చేసేలా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న నటి తెలుగులో దొరకకపోవకటంతో బాలీవుడ్ హీరోయిన్కే ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే లేడీఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ను సావిత్రి పాత్రకు ఎంపిక చేశాడు. ఉత్తరాదిలో సత్తా చాటినా.. దక్షిణాది భామే అయిన విద్యా, సావిత్రి పాత్రకు న్యాయం చేయగలదన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement