తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్ధ మనోహర రూపంతో, ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, హీరోయిన్ కృష్ణకుమారి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి మెప్పించింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో ఆమె జతకట్టింది.
16ఏళ్ల వయసప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం నవరత్నాలు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా మొదలుకొని “బంగారు పాప” వరకూ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారిని “ఫ్లాపుల హీరోయిన్” అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణకుమారి.. కావాలనే వేరే హీరోయిన్స్ కోసం అబద్దాలు ఆడి కొందరు ప్రొడ్యూసర్స్ తనను సినిమాల్లో తప్పించారని పేర్కొంది.
ఇక అప్పట్లోనే ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'లక్షాధికారి' అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అలనాటి తార సావిత్రి గురించి చెబుతూ ఆమె ఏమన్నారంటే.. 'సావిత్రి జీవితం చివరిరోజుల్లో అలా అయ్యేసరికి చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె ఇంటిలిజెన్స్ ఏమైంది? పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా? అందుకే ఆమె చనిపోతే చూడటానికి కూడా వెళ్లలేదు' అంటూ గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా అనారోగ్యంతో ఆమె 2018, జనవరి 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment