కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న మహిళ బయటకు పరుగులు తీసి గడ్డివాము వద్దకు వెళ్లడంతో.. గడ్డివాముకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం రానంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన సావిత్రి(28) బుధవారం రాత్రి భర్తతో గొడవపడి ఈరోజు తెల్లవారుజామున వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆ మంట తాళలేక గడ్డివాము వద్దకు పరుగులు తీయడంతో.. గడ్డివాముకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పడానికి యత్నించే లోపే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.