మహానటి సావిత్రిగా నిత్యామీనన్ | Nithya Menen to portray legendary actor Savitri in her biopic? | Sakshi
Sakshi News home page

మహానటి సావిత్రిగా నిత్యామీనన్

Published Fri, Aug 19 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

మహానటి సావిత్రిగా నిత్యామీనన్

మహానటి సావిత్రిగా నిత్యామీనన్

నటిగా అభినేత్రి సావిత్రిని కీర్తించడం సాహసమే అవుతుంది. సినిమా ఉన్నంత కాలం ఈ మహానటి గుర్తుండిపోతుంది. దిగ్గజాల్లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్, జెమినిగణేశన్ వంటి నటులకు దీటుగా నటించిన మేటి నటి సావిత్రి. ఆమె నిజ జీవితం వెలుగు నీడ అనాలో, చీకటి వెలుగు అనాలో తెలియదు గానీ, ఒక చరిత్ర అని మాత్రం చెప్పవచ్చు. అలాంటి అత్యున్నత నటి సావిత్రిని అనుకరించడం అన్యులకు సాధ్యం కాదు.
 
  అయితే అలాంటి ప్రయత్నానికి ఇప్పుడు యువ నటి నిత్యామీనన్ సాహసిస్తుండడం విశేషం. సావిత్రి జీవితాన్ని తెరకెక్కించనున్నారు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదీ ఆయనకు ఒక సాహసమే అనక తప్పదు. కాగా ఆయన సావిత్రి నిజ జీవితాన్ని సునిశితంగా శోధించి కథను సిద్ధం చేసుకున్నారట. దాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో సావిత్రి పాత్రకు నటి నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించ గా తను పచ్చజెండా ఊపారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
 
 చిత్రం డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తారల బయోగ్రఫీతో చిత్రాలు తెరకెక్కడం అన్నది అరుదైన విషయమే. ఆ మధ్య శృంగార తార సిల్క్‌స్మిత జీవిత చరిత్రతో హిందీలో ద డర్టీ పిక్చర్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అందులో స్మిత పాత్రలో నటించిన ప్రముఖ నటి విద్యాబాలన్ జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే ఆ కథకు సావిత్రి జీవిత కథకు చాలా వ్యత్యాసం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement