'మహానటి'గా మలయాళీ బ్యూటీ | Malayali heroine Nithya Menon in talks for Savitri biopic | Sakshi
Sakshi News home page

'మహానటి'గా మలయాళీ బ్యూటీ

Published Tue, Aug 16 2016 1:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

'మహానటి'గా మలయాళీ బ్యూటీ

'మహానటి'గా మలయాళీ బ్యూటీ

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మహానటి సావిత్రి జీవిత చరిత్రను వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్ వేట కూడా కొనసాగుతోంది. నటిగా ఎన్నో అద్భుత విజయాలను సాధించిన సావిత్రి పాత్రలో నటించేందుకు సరైన నటి ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

తొలుత ఈ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ను తీసుకుంటారన్న టాక్ వినిపించింది. అయితే దర్శకుడు ఈ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఆ తరువాతే నటీనటుల ఎంపిక మొదలు పెడతామని ప్రకటించాడు. అయితే తాజాగా మహానటి పాత్రకు మరో హీరోయిన్ ను సంప్రదించారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నిత్యామీనన్ ను మహానటి సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్, నిత్యా మీనన్ కు కథ కూడా వినిపించాడట.. అయితే నిత్యా నుంచి ఎలాంటి హామి రాలేదన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆమె త్వరలోనే తన నిర్ణయం ప్రకటించనుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement