
మృతి చెందిన కాల్వ సావిత్రి
నందిగామ: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి (33)తో వివాహమైంది. వారు పరిటాలలోనే నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో అసిస్టెంట్ లైన్ ఉమెన్‌గా సావిత్రికి ఉద్యోగం వచ్చింది.
దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నందిగామ పట్టణ శివారుల్లో 65వ నంబరు జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన మారుతీరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి)
Comments
Please login to add a commentAdd a comment