ఉపాధ్యాయుల కొరత తీర్చకపోతే పోరాటమే
టిఎస్‌యూటీఎఫ్
దోమలగూడ: రేషనలైజేషన్ పేరు చెప్పి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం శోచనీయమని, ఉపాధ్యాయులను నియమించకపోతే పోరాటం తప్పదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దోమలగూడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
పాఠశాలల్లో స్వీపర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తక్షణమే సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్, పరీక్షల విధానం మారిందని గుర్తు చేశారు. వీటిపై ఉపాధ్యాయులకు అవగడాహన కల్పించాలని, మారిన పాఠ్యపుస్తకాలపై శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 10వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్ల ఖాళీలను అడ్‌హక్ రూల్స్‌లో పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు.
‘సావిత్రి’ వద్దు
‘సావిత్రి’ పేరుతో రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన సినిమా పోస్టరును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉన్న పోస్టర్‌లు ముద్రించవద్దని, అసలు సినిమా నిర్మాణమే వద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు మానవ హక్కుల క మిషనర్‌ను, నగర పోలీసు క మిషనర్‌ను కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినట్టు చెప్పారు.
‘సావిత్రి’ వద్దు
Published Tue, Oct 7 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement