కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్‌కే దర్శకత్వంలో ‘ఉపేంద్ర గాడి అడ్డా’ సినిమా సోమవారం ఆరంభమైంది. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్‌కి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ ఇచ్చారు.
ఆర్యన్ సుభాన్ ఎస్‌కే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం వరుణ్ సందేశ్‌తో ‘కానిస్టేబుల్’ చిత్రం చేస్తున్నాను. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటూనే యువతకు సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా అబ్బాయి ఉపేంద్రతో తొమ్మిది చిత్రాలు తీయాలనుకున్నాం. ఇప్పటికే నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ ఐదో సినిమా’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు.
Comments
Please login to add a commentAdd a comment