మహానటి లిస్ట్లో మరోపేరు | Keerthi Suresh Starring Savitri Biopic Mahanati | Sakshi
Sakshi News home page

మహానటి లిస్ట్లో మరోపేరు

Published Tue, Jan 3 2017 12:27 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

మహానటి లిస్ట్లో మరోపేరు

మహానటి లిస్ట్లో మరోపేరు

దేశం గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవితకథను సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగఅశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్కు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై చాలా కాలం అవుతున్న ఇంతవరకు పట్టా లెక్కలేదు. ముఖ్యంగా మహానటి సావిత్రి పాత్ర కోసం నటిని ఎంపిక చేయడమే యూనిట్ సభ్యులకు కష్టమవుతోంది.

ఇప్పటికే మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఈ లిస్ట్లో మరో పేరు వినిపిస్తోంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన కీర్తీ సురేష్ను ఈ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ కీర్తీ పేరునైన యూనిట్ సభ్యులు ప్రకటిస్తారో లేక మరోసారి రూమర్స్ అంటూ కొట్టిపారేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement