మీ మేనత్త శ్రీలక్ష్మి సిఫార్సు చేయలేదా? | Aishwarya Rajesh Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

మహానటి లాంటి చిత్రాలు ఎప్పుడోగాని రావు

Published Mon, Oct 1 2018 11:27 AM | Last Updated on Mon, Oct 1 2018 6:27 PM

Aishwarya Rajesh Chit Chat With Sakshi

ఐశ్వర్యారాజేశ్‌

సినిమా: మహానటి లాంటి చిత్రాలు ఎప్పుడో పదేళ్లకొక్కసారి వస్తాయని నటి ఐశ్వర్యారాజేశ్‌ అన్నా రు. ఆరణాల అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ తమిళసినిమాలో మంచి నటిగా రాణిస్తున్నా రు. నటనకు అవకాశం ఉంటే చాలు అది పెద్దదా? చిన్నదా? అన్న ఆలోచన లేకుండా నటించడానికి సి ద్ధం అంటున్న ఐశ్వర్యారాజేశ్‌ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలా కాక్కాముట్టై చి త్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చెక్క సివంద వానం(తెలుగులో నవాబ్‌) నటించే అరుదైన అవకాశాన్ని కూ డా దక్కించుకున్న ఐశ్వర్యారాజేశ్‌ ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్ర సక్సెస్‌ అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను ఈ బ్యూటీ సాక్షితో పంచుకున్నారు. ఆ ముచ్చట్లేమిటో చూసేద్దామా!

ప్ర:  మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి?
జ:చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి నటీ కలలు కంటుంది. అలాంటి అవకాశం ఇంత త్వరలో వస్తుందని నేను ఊహించలేదు.

ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
జ:నిజం చెప్పాలంటే  కాట్రువెలియిడై(తలుగులో చెలియా) చిత్రం నిర్మాణం సమయంలో మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. అయితే అది నటి అధితిరావు పాత్రకు డబ్బింగ్‌ చెప్పడానికి అని తెలిసింది. అయినా నా వాయిస్‌ ఆమెకు సెట్‌ కాలేదు. మరోసారి అలాంటి ఫోన్‌నే వచ్చింది.  ఈ సెక్క సివంద వానం చిత్రం ప్రారంభం సమయంలోనూ మణిరత్నం కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో అదీ అలాంటిదేదో అయ్యి ఉంటుందిలే అనుకున్నాను. అయితే చిత్రంలో నటించాలని చెప్పినప్పుడు నిజమేనా? అని నమ్మలేకపోయాను. నిజం కావడంతో కల నిజమైందని సంతోష పడ్డాను. నేను ఇంతకు ముందు చాలా చిత్రాల్లో నటించినా, యాక్టింగ్‌ అంటే ఎలా ఉంటుందన్నది మణిరత్నం నుంచి నేర్చుకున్నాను.ఆయనలో మ్యాజిక్‌ ఉంది. ఈ చిత్రం నాకోక పాఠం.

ప్ర: సెక్క సివంద వానం చిత్రంలో మీ పాత్ర గురించి?
జ:ఇందులో నేను సిలోన్‌ అమ్మాయిగా నటించాను.

ప్ర:  ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది.మీకు అలాంటి చిత్రంలో నటించాలన్న కోరిక ఉందా?
జ: నిజం చెప్పాలంటే బయోపిక్‌ కథా చిత్రాలు ఎప్పుడో గానీ రూపొందవు. మహానటి చిత్రంలో కీర్తీసురేశ్‌ చాలా బాగా నటించారు. అయితే అలాంటి పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలాంటి కథా చిత్రం అమిరితే కచ్చితంగా నటిస్లాను.  నా కేరీర్‌లో ఒక మరపురాని చిత్రంగా కనా చిత్రం నిలిచిపోతుంది.

ప్ర:  తెలుగు అమ్మాయి అయ్యి ఉండి తెలుగు చిత్రాల్లో నటించడం లేదే?
జ:నిజం చెప్పాలంటే తెలుగులో నటించాలని నాకూ ఉంది. అయితే అక్కడ సరైన అవకాశాలు రాలేదు. కొన్ని వచ్చినా మంచి కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. అయితే అలాంటి అవకాశం ఒకటి ఇప్పుడు వచ్చింది. త్వరలోనే ఒక భారీ చిత్రంలో నటించనున్నాను. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ప్ర: మీ మేనత్త శ్రీలక్ష్మి తెలుగులో ప్రముఖ నటి. ఆమె సిఫార్సు చేయలేదా?
జ: అత్త శ్రీలక్ష్మి కొన్నాళ్లు హైదరా బాద్, కొన్నాళ్లు చెన్నైలో నివశిస్తుంటారు. చెన్నైకి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తారు. అయితే ఎందుకనో సిఫార్సు చేయమని నేనూ అడగలేదు. ఆమె చేయలేదు.

ప్ర:  ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
జ:ధనుష్‌కు జంటగా నటించిన వడచెన్నై త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అదే విధంగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రంలో పాలు మరి కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

ప్ర:  తెలుగులో ఏ హీరోతో నటిం చాలని కోరుకుంటున్నారు?
జ: తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ ఇలా చాలా మంది నచ్చిన హీరోలు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాష్‌ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement