
‘మహానటి’ని చూడ్డానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. నిన్నటి వరకు సినిమాలో ఎవరు ఏ పాత్రలు చేశారో ప్రోమోల ద్వారా విడుదలచేశారు. నాని వాయిస్‌ఓవర్ ద్వారా పరిచయం చేసే ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ప్రకాశ్‌రాజ్ పోషించిన పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రోమో ద్వారా విడుదల చేశారు. ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆలూరి చక్రపాణి తెలుగు చిత్రసీమకు సుపరిచితులు. మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాలతో సావిత్రి అభినయాన్ని మనకు చూపించారు ఆయన. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్నాదత్‌లు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment